సాధారణంగా ఒక స్టార్ హీరో ఏదైనా భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడు అంటే చాలు ఇక ఆ సినిమాపై అభిమానులు అంచనాలు ఏ రేంజ్ లో పెరిగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రకటన విడుదలైన నాటి నుంచి కూడా అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతక ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు. అలాంటిది ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది అంటే చాలు ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక ఈ మధ్యకాలంలో మాత్రం ఎందుకో స్టార్ హీరోలు సినిమాలు తరచూ అభిమానులను నిరాశ పరుస్తూనే ఉన్నాయి.


 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమాలు ఇక ఒకసారి విడుదల తేదీని ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత వివిధ కారణాల కారణంగా విడుదల తేదీని వాయిదా వేస్తూనే వస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందని ఆత్రుతగా ఎదురుచూసే అభిమానులకు ఇలా విడుదల తేదీ తరచూ వాయిదా పడటం కారణంగా చివరికి నిరాశ ఎదురవుతూ ఉంది. ఇక ఇప్పుడు సూర్య అభిమానులకు కూడా ఇలాంటి ఒక బ్యాడ్ న్యూస్ అందబోతుంది అన్నది తెలుస్తుంది. స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కాంగువ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.


 ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్య కెరియర్ లోనే కంగువా మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందని అభిమానులు అనుకుంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాను అక్టోబర్ 10వ తేదీన విడుదల చేసేందుకు ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా ఈ డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా.. కంగువా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దీంతో అభిమానులు కంగారు.పడుతుండగా ఇలా రిలీజ్ వాయిదా పడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సినీ వర్గాల నుండి సమాచారం. పోస్ట్ ఫోన్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అఫీషియల్ గా ప్రకటన చేస్తుందని సినీ వర్గాలు. చెబుతున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: