సినీరంగంలో నిర్మాతలు రెండు రకాలుగా ఉంటారు.. కొందరు నిర్మాత‌లు డబ్బులు పెట్టడం వరకే ఆలోచిస్తారు.. కథ‌ ఏమిటి ? కాకరకాయ ఏమిటి ? అన్నది పెద్దగా పట్టించుకోరు.. కాంబినేషన్ బాగుందా అన్నది మాత్రమే చూస్తారు. రెండో రకం నిర్మాతలు కథ దగ్గర నుంచి ఫైనల్ కాపీ వరకు ఓ టెక్నీషియన్ లా పనిచేస్తారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఈ కోవ‌లోకి వస్తారు.. అయితే చిత్ర‌సీమలో మొదటి రకం నిర్మాతలు ఎక్కువగా ఉంటారు. వారి దగ్గర కావలసినంత డబ్బు ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు సెట్ చేసి ఆ కాంబినేషన్ ఎక్కువగా నమ్ముకుని బిజినెస్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అగ్ర‌ నిర్మాత డివివి దానయ్య కూడా డబ్బులు పెట్టడం వరకే పరిమితం అవుతారన్న సంగతిని హీరో నాని తాజాగా రివిల్ చేసేశారు.


నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమాకు దానయ్య నిర్మాత. ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఫంక్షన్ లో దానయ్యకు సంబంధించిన ఈ టాప్ సీక్రెట్ ను నాని బయట పెట్టేశారు. దానయ్యకు ఆయన చేసే సినిమాలు కథలు ఏ మాత్రం తెలియద‌ని.. కానీ సెట్లోకి వచ్చినప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారని నాని తెలిపారు. ఆయనలో పాజిటివ్ యాటిట్యూడ్ బాగా నచ్చుతుందని అందుకే కథలు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాయని నాని తెలిపారు. నాని కామెంట్లు ఎలా ఉన్నా ? ఇంత పెద్ద ప్రాజెక్టులు పెద్ద సినిమాలు తీసే నిర్మాతకు కథ తెలియక పోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.


కథ తెలియకపోతే ఆ సినిమాపై నిర్మాతకు జడ్జిమెంట్ ఎలా కుదురుతుంది ? కథ తెలియకుండా అంత పెద్ద బడ్జెట్ ఎలా పెడుతున్నారు అన్న ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుంది. అయితే దానయ్య టైప్ వేరు.. ఆయన ఎక్కువగా కాంబినేషన్ను నమ్ముకునే నిర్మాత. రాజమౌళితో సినిమా సెట్ అయితే చాలు కథ ఎవరికి కావాలి ? పవన్ కళ్యాణ్ కాల్ సీట్లు ఇస్తే చాలు కథ‌ ఎవరికీ కావాలి ? ఓజి కథ గురించి ఆయన ఎందుకు పట్టించుకుంటారు.. మార్కెట్లో ఫామ్ లో ఉన్నది ఎవరు ? ఎవరితో సినిమా తీస్తే లాభపడతాం అనే టెక్నిక్ నిర్మాతకు తెలిస్తే చాలు.. అది దానయ్యకు తెలుసు. అందుకే దానయ్య కథ‌.. కాకరకాయ షూటింగ్ విషయాలలో పెద్దగా జోక్యం చేసుకోరు

మరింత సమాచారం తెలుసుకోండి: