రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ హీరో అయినా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాలంటే రాజమౌళితో సినిమా చెయ్యాల్సిందే.అలాంటి స్టాండర్డ్స్ ని సెట్ చేసాడు. ఇక మహేష్ బాబు బ్రాండ్ ఎలాంటిదో ఆయన గత చిత్రాల బాక్స్ ఆఫీస్ వసూళ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఫ్లాప్ టాక్ తో కూడా వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొట్టగలిగే స్టామినా ఉన్న అతి తక్కువమంది హీరోలలో ఒకరు. అంతే కాకుండా మహేష్ బాబు కి రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు అలాంటివి. ముఖ్యంగా పోకిరి చిత్రాన్ని ప్రతీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. ఆ సినిమా ద్వారానే ఆయన నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యాడు.అలాంటి ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిస్తే ఆ సునామీని ఊహించడం మన వల్ల సాధ్యం అవుతుందా..?, ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ సునామీ రావాల్సింది. కానీ ఎవరి కమిట్మెంట్స్ తో వారు బిజీ గా ఉండడం వల్ల ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ కుదిరింది. ఇప్పుడు రాబోతున్న సునామీ ఇంకా భయంకరమైనది, ఈ సునామీ దెబ్బకి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ గత రెండు నెలల నుండి హైద్రాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మహేష్ బాబు లుక్ కూడా బయటకి లీక్ అయ్యింది. ఒక వారియర్ లాగా ఆయన అభిమానులకు అనిపిస్తున్నాడు. ఇంతకీ రాజమౌళి.. సూపర్‌స్టార్‌ గురించి ఈ ఏడాదే అనౌన్స్ చేస్తారా? లేకుంటే వచ్చే ఏడాది దాకా ఊరిస్తూనే ఉంటారా? బాగా జుట్టు పెంచి మహేష్‌ కూడా మేకోవర్‌ అవుతున్నారు.

 
అలాంటప్పుడు ఇంకా అనౌన్స్ మెంట్‌కి జక్కన్న ఎందుకు ఆగుతున్నట్టు.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా మాత్రం 2028లోనే రిలీజ్‌ అవుతుందనే మాట మరోవైపు వైరల్‌ అవుతోంది.మహేష్ చివరి చిత్రం గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం గడుస్తోంది. అయినా ఇంతవరకు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించలేదు. ఆగష్టులో అంటూ ఊహాగానాలు వచ్చాయి. సెప్టెంబర్ కూడా వచ్చేస్తోంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉంది. కానీ జక్కన్న పెద్ద స్కెచ్ వేశారట. ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ అనిపించేలా.. హాలీవుడ్ చిత్రాలని తలదన్నేలా ఈ మూవీ ఉండాలనేది రాజమౌళి ఆలోచన. దీనికోసం రాజమౌళి ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో టై అప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట ఇది కనుక జరిగితే హాలీవుడ్ లో ఈ చిత్ర బిజినెస్ లెక్కలు మారిపోతాయి. కనీవినీ ఎరుగని భారీ ప్రాజెక్ట్ అవుతుంది. హాలీవుడ్ స్టూడియో కన్ఫర్మేషన్ కోసం రాజమౌళి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రం ఆలస్యం అవుతోందట. వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది. మహేష్ ఈ మూవీలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: