చాలా మంది నటీమణులు ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమా విడుదల కాకముందే అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే మొదటి సినిమా విడుదల కాకముందే భారీ అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. నటించిన మొదటి మూవీ నే రిలీజ్ కాకముందే మంచి క్రేజ్ ను దక్కించుకోవడం , వరుస అవకాశాలు దక్కుతూ ఉండడంతో వారికి కనుక మంచి విజయాలు దక్కినట్లు అయితే చాలా ఈజీగా అలాంటి నటీమణులు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. మిస్టర్ బచ్చన్ మూవీ విడుదల కాకముందే ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం జరిగింది. అలాగే ఈ మూవీ విడుదల కాకముందే ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ దక్కింది. దానితో ఈమె నటించిన మిస్టర్ బచ్చన్ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీకి దక్కుతాయి అని , చాలా తొందరగా ఈమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది భావించారు.

కానీ మంచి అంచనాల నడుమ విడుదల అయిన మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో ఈమెకు భారీ అవకాశాలు దక్కాలి అంటే మంచి విజయాలు రావలసి ఉంది. మరి స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న ఈ ముద్దుగుమ్మకు మిస్టర్ బచ్చన్ మూవీ అపజయంతో భారీ కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bsb