ఓవర్ సీస్ రీ రిలీజ్ లో భాగంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఓవర్ సీస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ కుర్ర హీరోలకు , యంగ్ హీరోలకు అదిరిపోయి రేంజ్ టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రీ రిలీజ్ లో భాగంగా ఏ సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 61 వేల డాలర్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి సినిమా 60144 డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి సినిమా 59,843 డాలర్ల గ్రాస్ తో మూడవ స్థానంలోనూ , సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా రూపొందిన చెన్నకేశవ రెడ్డి సినిమా 51129 డాలర్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన జల్సా సినిమా 37,973 డాలర్లతో 5 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా బిజినెస్ మాన్ సినిమా 27,390 డాలర్ల కనెక్షన్లతో 6 వ స్థానంలోనూ , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి సినిమా 24296 డాలర్లతో 7 వ స్థానంలో కొనసాగుతుంది. ఇక మహేష్ బాబు హీరోగా రూపొందిన పోకిరి సినిమా 15,846 డాలర్లతో 8 వ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రూపొందిన బిల్లా సినిమా 13581 డాలర్లతో 9 వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: