కమెడియన్ సూరి , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి వెట్రీ మారన్ "విడుదలై పార్ట్ 1" అనే పేరుతో ఓ మూవీ ని రూపొందించిన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో విడుదల పార్ట్ 1 అనే పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా అటు తమిళ్ , ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ ల దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా విడుదలై పార్ట్ 2 సినిమా షూటింగ్ ను కొంత కాలం క్రితమే మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా 30 శాతం. మిగిలి ఉండగానే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైం నాలుగు గంటలకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ దర్శకుడు ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా మూడవ భాగంగా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానితో మరి కొంత కాలం లోనే విడుదల రెండవ భాగాన్ని విడుదల చేసి ఆ తర్వాత విడుదల మూడవ భాగాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే విడుదల మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రెండవ భాగం కూడా మంచి విజయం సాధించినట్లు అయితే మూడవ భాగంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడతాయి. మరి ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా లేక కొంత కథను తగ్గించి రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: