తమిళ్ స్టార్ హీరోల మధ్య వార్ అంటే ఆ భాషలోని అన్ని బూతులు బయటకు వచ్చేలా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయ్, అజిత్ లాంటి హీరోల ఫ్యాన్స్ అసహ్యంగా ట్రోల్స్ చేసుకుంటారు. అలాంటిది కాదు కానీ.. ఇప్పుడు మరో స్టార్ వార్ కు దసరా వేదిక కాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ వర్సెస్ సూర్యగా దసరా వేదిక అయింది. సూర్య ఫ్యాన్స్ మరీ దారుణంగా ఉండరు. ఇటు రజినీ ఫ్యాన్స్ సిట్యుయేషన్స్ ను బట్ట రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడీ ఇద్దరు హీరోల ఫ్యాన్ వార్ కు అక్టోబర్ 10 వేదిక కాబోతోంది. కొన్నాళ్లుగా కంగువా లాంటి సినిమా ఇప్పటి వరకూ మన దేశంలోనే రాలేదు అని నిర్మాతలుచెప్పుకుంటున్నారు. అంతే కాదు.. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత కంగువా సీక్వెల్ టైమ్ కు తమతో పోటీ పడటానికి కూడా భయపడతారని హైలెట్ చేసుకుంటున్నారు. అందులో తప్పేం లేదు కానీ.. మరీ ఆ రేంజ్ లో మోయడం మాత్రం కొంత అతిశయోక్తిలా ఉంది అని చాలామంది చెప్పుకున్నారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోన్న కంగువాకు పోటీగా కన్నడ నుంచి మార్టిన్ ఉంది. ఇప్పుడు సొంత భాష నుంచే స్ట్రాంగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్ ను కంగువా రోజున అక్టోబర్ 10నే విడుదల చేయబోతున్నాం అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ అనౌన్స్ మెంట్ తో సూర్య ఫ్యాన్స్ లో కొంత కలవరం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎంత కాదనుకున్నా అక్కడ రజినీకాంత్ రేంజ్ వేరు. సూర్య రేంజ్ వేరు. పైగా ఈ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ లతో కూడిన భారీ తారాగణం కూడా ఉంది. అలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతం మరోసారి హైలెట్ అవుతుందంటున్నారు. అన్నిటికి మించి జై భీమ్ తో దేశ వ్యాప్తంగా ఫేమ్ అయిన టిజి జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మరింత ఆసక్తిగా మరింది.

మొత్తంగా తమిళ్ లో తమకు ఎదురుండదు అనుకున్న కంగువా టీమ్ కు వేట్టయాన్ మేకర్స్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. మరి కంగువా వర్సెస్ వేట్టాయాన్ వార్ లో విన్నర్ ఎవరో చూడాలి.
దీంతో రజనీ vs సూర్య ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. మా హీరో ముందు డేట్ అనౌన్స్ చేస్తే పోటీగా రజనీ సినిమా డేట్ వేశారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వాస్తవానికి సూర్య సినిమా నిర్మాతలే ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు రజనీ సినిమాతో పోటీ వద్దనుకుని సూర్య కంగువను అక్టోబరు 31 వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. కానీ అక్కడ శివకార్తికేయన్ నటిస్తున్న ‘అమరాన్’ రిలీజ్ కు రెడీ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: