మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని త్రిష , చిరంజీవి కి జోడిగా నటిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం సినిమాల విషయంలో కేవలం విశ్వంభర మూవీ పైనే ఫోకస్ పెట్టాడు. తన తదుపరి మూవీ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

చిరంజీవి నెక్స్ట్ మూవీ కి ఆ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు అని పలువురి పేర్లు తెర పైకి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక యాడ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా చిరు , హరీష్ శంకర్ కాంబో లో సారథి స్టూడియోలో ఒక యాడ్ షూట్ ను ఎలాంటి హడా విడి లేకుండా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

ఇకపోతే చిరంజీవి తదుపరి మూవీ కి హరీష్ శంకర్ కూడా దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది అని కొన్ని రోజుల క్రితం ఒక వార్త వైరల్ అయింది. దానికి సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇకపోతే హరీష్ శంకర్ తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: