ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లు కూడా వరసగా విజయాలు సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. దానితో అవకాశాలు కూడా భారీగా దక్కాయి. కానీ ఈమె బంగార్రాజు సినిమా తర్వాత నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి. 

చాలా కాలం పాటు అపజాయాలతో ఉన్న ఈమె తాజాగా మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. చాలా రోజుల తర్వాత ఈమెకు మనమే సినిమాతో మంచి విజయం దక్కడంతో మళ్లీ ఈమె ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే సినిమాలలో మొదటి నుండి తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ కుర్ర హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా అనేక సార్లు ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

తాజాగా కృతి శెట్టి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కృతి శెట్టి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలను బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks