తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాగే ఈయన ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో చాలా మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో సూర్య కు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే సూర్య ప్రస్తుతం కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దిశా పటానీ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. కాకపోతే ఈ సినిమా అక్టోబర్ 10 వ తేదీన విడుదల కావడం కష్టమే అని , ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఏదేమైనా ఈ సినిమా బృందం మాత్రం ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ ని యూ ఏ ఈ కి చెందిన ఫార్స్ ఫిలింస్ అనే సంస్థ ఏకంగా రూ. 40 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులకు భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి భారీ కలెక్షన్లను వసూలు చేస్తేనే ఈ మూవీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను అందుకునే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: