టాలీవుడ్ లో కమెడియన్గా ,విలన్ గా పలు రకాల పాత్రలలో నటించిన రావు రమేష్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇటీవలే రావు రమేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి రూపొందించింది. దీంతో ఈ సినిమాకి కాస్త హైప్ మాత్రం భారీగానే పెరిగిపోయింది. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ కూడా నటించింది. ఇందులో అంకిత కొయ్య, రమ్య పసుపులేటి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు.


డైరెక్టర్ సుకుమార్ భార్య సబితా మొదటిసారి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు.ఆగస్టు 23న ఈ సినిమా విడుదలై మొదటి షో తేనే మంచి మౌత్ టాకు తో దూసుకుపోతోంది. అలా విడుదలైన కేవలం మూడు రోజులలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ .2.50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందట. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర బృందం.


ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న చిత్రాలలో కమిటీ కుర్రాళ్ళు, అయ్ చిత్రాలు కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు మళ్లీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా చిన్న సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. హంగులు, ఆర్భాటాలు లేకున్నప్పటికీ ఎంతో చక్కటి అయినటువంటి కుటుంబ కథ చిత్రం కావడం చేత ప్రేక్షకులను మెప్పించగలిగారని చెప్పవచ్చు. కంటెంట్ బాగుండి కుటుంబ కథ చిత్రాలు కావాలని ప్రేక్షకులు మరొకసారి నిరూపించారు. మరి ఇప్పటికైనా దర్శకులు తీరు మారుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాల హవాని ఎక్కువగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: