అచ్చ తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ర్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, భూమిక, మిస్ మ్యాచ్, టక్ జగదీష్, రిపబ్లిక్, డ్రైవర్ మున, ధ్రువ నక్షత్రం, నవాబ్, డియర్ వంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించి తన అందం ,అభినయంతో ప్రతి ఒక్క సినీ ప్రియులకు దగ్గరయింది.


తన అద్భుతమైన నటనను చూసిన అభిమానులు ఐశ్వర్య రాజేష్ ను ఎంతగానో అభిమానించారు. కాగా, వెంకటేష్ ఫ్యామిలీ సినిమా చేస్తే హిట్ పక్కా. ఈ సినిమాలో వెంకటేష్ లవ్లీ హస్బెండ్ గా కనిపించనున్నారు. అపజయం ఎరుగని అనిల్ రాయపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో, శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ పోల్లచ్చిలో జరగనుంది.


అక్కడి అందమైన ప్రదేశాల్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారట. భాస్కర్ బట్ల రాసిన ఈ పాటను బీమ్స్ సిసిరోలియో స్వరాలు చేకూర్చారు. భార్యాభర్తల మధ్య ప్రేమను తెలిపే ఉత్తమమైన పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని... సంగీతం, సాహిత్యంతో పాటు కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ లవ్లీ డాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్ గా నిలుస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు.


వెంకటేష్ మాజీ పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ తో ఐశ్వర్య రాజేష్ కాస్త రొమాన్స్ ఎక్కువగా చేయనుందని సమాచారం. ఈ విషయం తెలిసిన పలువురు నెటిజెన్లు ఐశ్వర్య రాజేష్ ఇంతగా బరితెగించి సీనియర్ హీరోతో అలాంటి పనులు చేయడం అవసరమా అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: