ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ . ఒకటి రెండు సినిమాలతో  పాపులారీటీ తెచ్చుకుంటున్నారు. ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలా వచ్చిన ముద్దుగుమ్మే శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. అంతకు ముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది శ్రీలీల. ఇక పెళ్ళిసందడి సినిమాలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో శ్రీలీలే క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.
ధమాకా సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. వరుస సినిమాలు చేసిన ఆ  సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వీటిలో గుంటూరు కారం సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్న శ్రీలీల నటనకు ఆమె డాన్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆర్తి అగర్వాల్ తో పోల్చుతున్నారు. ఈ అమ్మడు చూడటానికి అచ్చం ఆర్తి అగర్వాల్ లానే ఉంది. శ్రీలీల, ఆర్తీ అగర్వాల్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

ఆర్తీ అగర్వాల్ ను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు. చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో నటించింది. అలాగే ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించింది. ఆతర్వాత బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకోగా అది వికటించి మరణించింది. ఇక ఇప్పుడు ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ శ్రీలీలలో ఆమెను చూసుకుంటున్నారు. ఈ ఇద్దరి ఫోటోలును కలిపి వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆర్తి అగర్వాల్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేమిటంటే ఇంద్ర సినిమా 175 డేస్ ఈవెంట్ లో ఆర్తి అగర్వాల్ మాట్లాడిన వీడియో. ఈ నెట్టిజెన్స్ షేర్ చేస్తూ అచ్చం శ్రీలీల ఉందంటున్నారు. ఆమె మాట్లాడుతుండగా ఇచ్చిన హావభావాలు, ఫేస్ కట్ సరిగ్గా సరిపోయాయని కామెంట్ చేస్తున్నారు. కాగా ఆర్తి అగర్వాల్  ఓన్ వాయిస్ ఫస్ట్ టైం వింటున్నామని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీలీలే కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. మరోసారి మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ పూజాకార్యక్రమంలో శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షించింది. మొన్నటివరకు సన్నగా సన్నజాజిలా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: