యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించిన అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇలా ఆర్ ఆర్ ఆర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది . అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయమన్నారు . ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో ఎన్టీఆర్ సొరతో ఫైట్ చేసే ఒక సన్నివేశాన్ని కొరటాల శివ డిజైన్ చేసినట్లు , ఇప్పటికే అందుకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్లు అది అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో రాజమౌళి , ప్రభాస్ సొరతో ఫైట్ సన్నివేశం ను డిజైన్ చేశాడు. అది ఆ సమయంలో అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరి ప్రస్తుతం కొరటాల "దేవర" సినిమాలో సొర తో ఫైట్ డిజైన్ చేసినట్లు అది అద్భుతంగా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దానిని తీర్చిదిద్దడంలో రాజమౌళి ని కొరటాల అధిగమించాడా ... అలాగే ఆ ఫైట్ లో ప్రభాస్ కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ అంతకు మించిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: