జబర్దస్త్ తన్మయి తండ్రి కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తన్మయి తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇందులో తన తండ్రి పాడే మోస్తూ కన్నీరు పెట్టుకుంటుంది తన్మయి. అలాగే ఓపిక వస్తున్న తన దుఃఖాన్ని సైతం ఆపుకుంటూనే తన తండ్రికి అంతక్రియలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. మా నాన్న నా హీరో నాన్న ఒక ఎమోషనల్ తనని మిస్ అవుతున్నందుకు చాలా దుఃఖపడుతున్నానంటూ.. నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావు నాన్న అంటూ తెలిపింది. అందుకు సంబంధించి ఒక వీడియోని షేర్ చేసింది.
ఈ విషయం తెలిసిన అభిమానులు నెటిజన్ల సైతం రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈమెకు ధైర్యం కూడా చెబుతున్నారు. ఎప్పుడూ కూడా జబర్దస్త్ రీల్స్ తో అందరినీ నవ్విస్తూ ఉండే తన్మయి. ఇలా ఒక్కసారిగా దుఃఖంలోకి ఉండడంతో అభిమానులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన్మయి ఇంస్టాగ్రామ్ లో కూడా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన కమెడియన్సుతో చేసినటువంటి రీల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కామెడీ షో హవా తగ్గడంతో చాలామంది కనుమరుగయ్యారు. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఉంటుందో లేదో కూడా చూడాలి.