బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ఆయన ఇండియా బిగ్గెస్ట్ హిట్ మూవీలలో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు . ఇక ఆయన నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ఎన్నో సినిమాల్లో నటించే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న అమీర్ ఖాన్ 2022 నుంచి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు . ఆయన నటించిన చివరి మూవీ లాల్ సింగ్ చద్దా .


ఈ చిత్రం అద్విత్ చందన్ దర్శకత్వంలో రూపొందింది . ఇక ఇందులో అమీర్ ఖాన్ అండ్ నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించారు . అయితే లాల్ సింగ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి మంచి అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ గా నిలవడంతో నష్టాల పాలయ్యారు . ఇక ఈ సినిమా అనంతరం అమీర్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు . తాజాగా ప్రియా చక్రవర్తి హోస్ట్ చేస్తున్న కార్యక్రమానికి హాజరైన అమీర్ ఖాన్ తన మూవీ ఫ్లాప్ కావడం గురించి పలు కామెంట్స్ చేశారు .


అమీర్ ఖాన్ మాట్లాడుతూ .. " లాల్ సింగ్ చద్దా మూవీలో నా నటన బాగాలేదు . అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది . నాకు పర్సనల్గా లాల్ సింగ్ చాలా ఇష్టం కానీ ఆ చిత్రంలో నా నటన మాత్రం ఓవర్గా అనిపించింది . ప్రజలు కూడా దానికి అందుకే కనెక్ట్ కాలేదు కావచ్చు . ఫెయిల్యూర్పు నేను బాధ్యతొడ్డి . తప్పంతా నాదే . కానీ నేను నటించే నెక్స్ట్ ఫిలిం మాత్రం అందరికీ నచ్చేలా చేస్తాను " అంటూ కామెంట్స్ చేశారు . ప్రజెంట్ అమీర్ ఖాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: