తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నారా రోహిత్ చేసిన సినిమాలు తక్కువగానే ఉన్నప్పటికీ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ లు ఏవి లేవు. చివరిగా 2018లో నారా రోహిత్ నటించిన వీరభోగ వసంతరాయలు సినిమాని రిలీజ్ అయింది. ఆ తర్వాత మరే సినిమా కూడా అంతగా విడుదల చేయలేదు. అయితే 2014లో జర్నలిస్టు మూర్తి డైరెక్షన్ లో ప్రతినిధి సినిమా సీక్వెల్ గా 2024లో ప్రతినిధి-2 చిత్రంతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియడం లేదు.


ఇదంతా ఇలా ఉన్నప్పటికీ హీరో నారా రోహిత్ ,డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి కాంబినేషన్లో వస్తున్న సుందరకాండ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ప్రశ్నలకు నారా రోహిత్ సమాధానాలను తెలిపారు. ఒక మీడియా ప్రతినిధి ఇలా అడుగుతూ ప్రతినిధి-2 హిట్ అయ్యింది కదా దీనికి సీక్వెల్ 3 తీసే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించగా.. ప్రతినిధి-2 సినిమా హిట్ అయ్యిందనే విషయం మీరు  చెప్పే వరకు నాకు తెలియడం లేదు.. రిలీజ్ అయిన విషయమే కూడా చాలామందికి తెలియలేదు మీరు హిట్ అంటారేంటి అంటూ నారా రోహిత్ సరదాగా సమాధానాన్ని తెలియజేశారు.


సినిమా ఫ్లాప్ అయిందని విషయం డైరెక్టుగా  చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు తన సినిమాలు ఏడాదికి రెండు మూడు చొప్పున విడుదల చేస్తూ ఉండేవారు నారా రోహిత్. కానీ 2019లో ఓడిపోయినప్పుడు నారా లోకేష్ ఎలాంటి సినిమాలు చేయలేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. చివరిగా 2024లో ప్రతినిధి-2  సినిమాతో వచ్చిన ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా అవ్వడంతో తన సినిమాలను మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. టిడిపి పార్టీకి కూడా ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేశారు నారా రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: