బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా పెళ్లిళ్లతో అటు వార్తల్లో నిలిచిన స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ కూడా ఒకరు అని చెప్పాలి. అమీర్ ఖాన్ నూ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. బాలీవుడ్ ను ఏలే ముగ్గురు ఖాన్ లలో అమీర్ కూడా ఒకరు. ఏకంగా 59 ఏళ్ళ వయసులో కూడా అద్భుతమైన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ.. ఇంకా సూపర్ హిట్ సినిమాలను చేస్తూ ఉన్నారు ఆయన. అయితే సినిమాలతోనే కాదు పెళ్లిళ్లతోనూ ఆయన వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. మొదట రీనాను పెళ్లి చేసుకున్న అమీర్ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి ఇక దర్శకురాలు కిరణ్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
చివరికి కిరణ్ రావుకి కూడా విడాకులు ఇచ్చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక గత కొంతకాలం నుంచి అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన మూడో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విడాకులు తీసుకున్నప్పటికీ తన మాజీ భార్యలు రీనా, కిరణ్ రావులతో మంచి అనుబంధమే ఉంది అంటూ అమీర్ ఖాన్ వెల్లడించారు. నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడుకాస్ లో మాట్లాడాడు. ఈ క్రమంలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ప్రశ్నించగా.. ఇప్పుడు నాకు 59 ఏళ్లు. ఈ వయసులో వివాహం అంటే కష్టమే. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అంటూ అమీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు.