మలయాళ ఇండస్ట్రీలో  రెండు రోజుల నుంచి జస్టిస్ హేమ నివేదికలు వైరల్ గా మారుతున్నాయి. చాలామంది ఈ నివేదికల తర్వాత మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే సమస్యలను లైంగిక వేధింపుల గురించి కూడా జస్టిస్ హేమ రిపోర్టులో తెలియజేసినట్లు తెలుస్తోంది. తాజాగా మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ డైరెక్టర్ తులసీదాస్ పైన ప్రముఖ నటి గీతా విజయన్ పలు రకాల ఆరోపణలు చేసింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆ డైరెక్టర్ ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడ్డానంటూ తెలియజేస్తోంది.


సినిమా షూటింగ్ షెట్లో తనకు డైలాగ్స్ చెప్పేవారు కాదని ఇండస్ట్రీలో తనని లేకుండా చేస్తానంటూ చాలాసార్లు బెదిరించారని కూడా తెలుపుతోంది గీతా విజయన్. 1991లో చంచట్టం ఈ సంఘటన ఎదురయ్యిందనీ తెలిపింది. సినిమా షూటింగ్లో భాగంగా హోటల్ రూమ్స్ కూడా బుక్ చేశారు. రాత్రి సమయంలో డైరెక్టర్ తులసీదాస్ తన గది తలుపులను రోజు కొడుతూ ఉండేవారని.. అలా ఆయన తీరును కూడా నేను తప్పుపట్టాను దీంతో ఆయన తన దగ్గర చాలా వింతగా ప్రవర్తించేవారు అంటూ తెలిపింది.


ఇలా ఎన్నో రిపోర్టులు సైతం హేమ కమిటీలో వెలుగులోకి వచ్చాయి.మహిళలకు వేధింపులకు గురిచేసిన వారందరికీ కూడా ఇప్పుడు చాలా భయాందోళన ఏర్పడుతోంది. వారికి తప్పకుండా శిక్ష పడుతుందని కూడా భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటూ గీత విజయవ్ తెలియజేస్తోంది. సుమారుగా ఈమె 150 కు పైగా చిత్రాలలో నటించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ రిపోర్టు ఒక సంచలనంగా మారిపోతోంది. ముఖ్యంగా దర్శక నిర్మాతలను ఉద్దేశించి చాలామంది నటీమణులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. అలా ఉదయం నిర్మాత సిద్ధికి పైన నటి రేవతి సంపత్ పలు రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ రంజిత్ పై కూడా బెంగాలీ నటి పలు రకాల ఆరోపణలు చేసింది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: