మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించి, బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న చిత్రాలలో హిట్లర్ కూడా ఒకటి. 1996లో మలయాళ మెగాస్టార్ హీరో మమ్ముట్టి ఇదే పేరుతో సినిమా తీసి మంచి విజయాన్ని అందుకోగా, ఆ కథను తీసుకొని తెలుగులో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య రీమేక్ చేసి చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా చేశారు. అప్పటికే బిగ్ బాస్, రిక్షావోడు వంటి చిత్రాలతో డిజాస్టర్ గా నిలిచి ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఈ స్టోరీ నచ్చి నటించేందుకు ఓకే చెప్పారు. అలా తెరపైకి వచ్చిన ఈ సినిమా 1997లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో చిరంజీవి హీరోగా, రంభ హీరోయిన్ గా, రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు.

సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు ఫ్లాప్ లు చవిచూసి ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన చిరంజీవికి మంచి బూస్టప్ ఇచ్చింది. ఇందులో ఏడుగురు చెల్లెళ్లకు అన్నగా కనిపిస్తాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ముఖ్యంగా ఆయనతో ఉండేది ఐదుగురు చెల్లెల్లే. మరి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. పెద్ద చెల్లెలు శారద ఈ క్యారెక్టర్ లో నటించింది ప్రముఖ నటి అశ్విని నంబిహార్. తమిళ్, మలయాళం చిత్రాలలో చేసి,  తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది. సినిమాలు సీరియల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న అశ్విని నంబియార్ ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా మారిపోయింది. ఇక పెళ్లి చేసుకుని సింగపూర్లో సెటిల్ అయిన ఈమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సీరియల్స్ చేస్తోంది.

రెండో చెల్లెలు అన్నపూర్ణ... ఈమె పేరు మోహిని mసౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె వివాహం అనంతరం 2006లో క్రిస్టియానిటీని తీసుకొని దైవచింతనలో బ్రతుకుతోంది. మూడో చెల్లెలు పద్మశ్రీ సీరియల్ నటి నాలుగో చెల్లెలు గాయత్రి సీరియల్ నటి,  ఆఖరి చెల్లెలు సరస్వతీ కూడా సీరియల్ నటి కావడం గమనార్హం. వీరంతా ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: