బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ కంగనా రనౌత్ ఎలాంటి విషయాన్నీ అయినా సరే డైరెక్ట్ గానే చెప్పేస్తూ ఎన్నో వివాదాలు కారణమవుతూ ఉంటుంది. తాజాగా ఈమె నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా జి స్టూడియోస్ బ్యానర్ తో కంగనా బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తన ఆస్తిని మొత్తం అమ్మి మరి నిర్మిస్తోంది. అనుపమ్ కేర్, మహిమా చౌదరి, ఇషాక్ నాయక్ తదితరునటి నటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం భారత ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.


ఎప్పటి నుంచో ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ చేస్తున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్లో రిలీజ్ చేయాలని కంగనా ఆలోచిస్తూ ఉండగా అప్పటికే ఎన్నో రకాల అప్డేట్లను కూడా ప్రకటించింది. ట్రైలర్ ని కూడా విడుదల చేసి అంచనాలను పెంచేసింది. రిలీజు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇప్పుడు ఎమర్జెన్సీ చిత్రానికి చిక్కులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.


అయితే ఇందులో ఉండే కొన్ని సన్నివేశాల పై పంజాబ్ ఫరీద్ కోట్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఈ సినిమాలోని సన్నివేశాల పైన అభ్యంతరాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఇందులో సిక్కులను  సైతం చాలా తప్పుగా చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ఆపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సైతం ఒక లేఖ ద్వారా పూర్తి వివరాలను తెలియజేశారట. మరి రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో చూడాలి అసలు కంగానా ఎమర్జెన్సీ విడుదలకు ఇది బ్రేక్ పడుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. మరి వీటన్నిటిని ఎదుర్కొని కంగాన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుందేమో చూడాలి. ఇటీవల పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీగా గెలిచింది కంగనా రనౌత్.

మరింత సమాచారం తెలుసుకోండి: