ఆగష్టు 15ని టార్గెట్ చేస్తూ విడుదలైన భారీ సినిమాలు ‘మిష్టర్ బచన్’ ‘డబల్ ఇస్మార్ట్’ ఘోర పరాజయం చెందితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఆయ్’ హిట్ కొట్టింది. దీనితో కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు అన్న విషయం ‘ఆయ్’ మూవీ మరొకసారి రుజువు చేసింది. ఈనేపధ్యంలో గతవారం విడుదలైన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ మూవీ కూడ ఎటువంటి అంచనాలు లేకుండా సక్సస్ టాక్ తెచ్చుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



రావ్ రమేష్ ని టైటిల్ రోల్ లో పెట్టి సుకుమార్ భార్య తబిత నిర్మాతగా చేసిన సాహసానికి ప్రశంసలతో పాటు కలక్షన్స్ కూడ సంతృప్తికరంగా ఉండటం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి రామ్ రమేష్ ను లీడ్ రోల్ లో పెట్టి నిర్మాతలు ఒక పెద్ద సాహసమే చేశారు. అయితే ఈసినిమాను ఆల్లు అర్జున్ సుకుమార్ లాంటి టాప్ సెలెబ్రెటీలు ఈమూవీని బాగా ప్రమోట్ చేయడంతో పాటు అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఈమూవీని చూసి వచ్చి ప్రశంసలు కురిపిస్తూ ఈమూవీ అందరూ చూడవలసిన సినిమా అంటూ ప్రశంసలు కురిపించడంతో ఈమూవీ పై అందరిలోనూ ఆశక్తి పెరిగింది.



ఈమూవీకి కలక్షన్స్ బాగా వస్తున్న పరిస్థితులలో రావ్ రమేష్ చేసిన సాహసం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రిగా మారింది. ఈమూవీకి గడిచిన వీకెండ్ లో వచ్చిన కలక్షన్స్ సంతృప్తికరంగా ఉండటంతో ఈమూవీ నిర్మాతలు జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న రావ్ రమేష్ తాను హీరోగా కూడ నటించి మెప్పించగలను అన్న విషాయాన్ని అందరికీ తెలిసేలా చేశాడు.



కామెడీ ఎంటర్ టైనర్ మూవీలో హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నప్పటికీ జనాలు ఆవిషయాలను పట్టించుకోకుండా ధియేటర్లకు రావడంతో భవిష్యత్ లో రావ్ రమేష్ ను కీలక పాత్రలో పెట్టి సినిమాలు తీసేవారి సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యంలేదు అన్నది నిజం..

 



మరింత సమాచారం తెలుసుకోండి: