ప్రస్తుతం మాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చెప్పనక్కర్లేదు. ఒక్కొక్కరిగా చాలామంది నటీమణులు బయటికి వచ్చి తమకు జరిగిన లైంగిక ఆరోపణలను బయట పెడుతున్నారు. ఇప్పటికే మాలీవుడ్ బ్యూటీ రేవతి సంపత్ నటుడు సిద్ధికీ తనని లైంగికంగా వేధించాడని చెప్పి సంచలన ఆరోపణలు చేసింది. ఇక దీనిపై సిద్ధికి కూడా కేరళ పోలీసులకు తనపై తప్పుడు ప్రచారం చేసిందని కంప్లైంట్ ఇచ్చారు.ఇక రేవతి సంపత్ ఇక్కడితో ఊరుకోకుండా మరో తెలుగు విలన్ పై కూడా తాజాగా సంచలన విషయం బయటపెట్టింది తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడిపై సంచల కామెంట్స్ చేసింది.రేవతి సంపత్ మాట్లాడుతూ.. ఆ నటుడు నాతో పడుకోడానికి నీకు ఇష్టమేనా అంటూ నాకు ఫోన్ చేసి మరీ ఇబ్బంది పెట్టాడు. 

అంతేకాదు నేను ఆయన మాట్లాడుతున్నంతసేపు సైలెంట్ గా ఉండడంతో నాకు ఇష్టం లేదని గ్రహించాడు. అంటూ సంచలన సృష్టించింది రేవతి సంపత్. ఇక విషయంలోకి వెళ్తే.. తెలుగులో నాయుడమ్మ,స్టాలిన్, దొంగలు, నీ మనసు నాకు తెలుసు, కారా మజాకా, గురు, గజిని, తులసి వంటి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించారు నటుడు రియాజ్ ఖాన్.. ఇక ఈయన పేరు తెలియకపోవచ్చు కానీ మొహం చూస్తే గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా ఈయన రవితేజ హీరోగా చేసిన దొంగోడు మూవీలో పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించారు. అయితే అలాంటి ఈ నటుడిపై తాజాగా సంచలన ఆరోపణలు చేసింది నటి రేవతి సంపత్.. ఆమె మాట్లాడుతూ.. రియాజ్ ఖాన్ ఓ ఫోటోగ్రాఫర్ ద్వారా నా ఫోన్ నెంబర్ తీసుకొని అర్థరాత్రి నాకు ఫోన్ చేసి నాతో పడుకోవడం నీకు ఇష్టమేనా.. నాతో పడుకోవడానికి వస్తావా..

నీకు ఏ యాంగిల్ లో చేయడం అంటే ఇష్టం అంటూ నన్ను లైంగికంగా వేధించారు.అయితే ఈ మాటలు  నేను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినవి. అయితే ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను సైలెంట్ గా ఉండడంతో నాకు ఇష్టం లేదని గ్రహించి ఇంకో తొమ్మిది రోజులు ఇక్కడే ఉంటాను. ఎవరైనా అమ్మాయిలు ఉంటే దగ్గరికి పంపించు అని చెప్పారంటూ రియాజ్ ఖాన్ వ్యవహారం మొత్తం బయటపెట్టేసింది నటి రేవతి సంపత్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ మాలీవుడ్లో దుమారం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: