బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సీరియల్‌లో యాక్ట్ చేసిన నటీనటులందరూ ఎంతో గుర్తింపు పొందారు. బుల్లితెర ప్రేక్షకులు అయితే గుప్పెడంత మనసు సీరియల్‌కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారని చెప్పాలి. అలాంటి సీరియల్‌లో జగతి మేడమ్ పాత్ర అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. జగతి క్యారెక్టర్ చేసిన జ్యోతి రాయ్ అందులో హోమ్లీ క్యారెక్టర్ చేసింది. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. సీరియల్‌లో తల్లి పాత్ర చేసిన ఈ బ్యూటీ బయట మాత్రం హీరోయిన్ మెటీరియల్‌కు ఏ మాత్రం తీసిపోదు. ప్రస్తుతం ఆమె తన అందాల ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ బ్యూటీ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు షేర్ చేయడం వల్ల కుర్రకారు కూడా జ్యోతి రాయ్ ఫ్యాన్స్ అయిపోతున్నారు. సీరియల్‌లో ఎంతో పద్దతిగా కనిపించిన జ్యోతిరాయ్ నెట్టింట గ్లామర్‌గా కనిపించే సరికి సీరియల్ లవర్స్ కాస్తా షాక్ అవుతున్నారు. మరోవైపు కుర్రాళ్లను జ్యోతి రాయ్ నిద్రపోనివ్వటం లేదు. హాట్ హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తూ జ్యోతి రాయ్ నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

జ్యోతి రాయ్ షేర్ చేసే ఫోటోలకు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉందని చెప్పాలి. అందాలను ఆరబోస్తూ జగతి మేడమ్ ఫోటోలకు ఫోజులివ్వడం చూసి ఆమె అందానికి అందరూ ముగ్దులవుతున్నారు. ఆమె మళ్లీ ఎప్పుడెప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ లంగాఓణితో ఫోటోలు దిగింది. నెట్టింట ఆ ఫోటోలను వదలడంతో హీరోయిన్స్ కూడా మీ ముందు ఏ మాత్రం పనికిరారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా జ్యోతి మేడమ్‌కు హీరోయన్ ఛాన్స్ ఇవ్వాలంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ ఆనందంతో రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి జగతి మేడమ్ తన హాట్ హాట్ ఫోటోలతో రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: