ప్రియా వడ్లమాని అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అదే హుషారు మూవీలో ఉండిపోరాదే అనే సాంగ్‌లో హీరోయిన్ అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. కెరీర్‌లో మొదట మోడల్‌గా అడుగుపెట్టిన ప్రియా వడ్లమాని ఆ తర్వాత సినిమాలపై ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 2016లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో కూడా ఈ బ్యూటీ పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ప్రేమకు రెయిన్‌చెక్ అనే మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

కోస్తా ఆంధ్ర కుటుంబానికి చెందిని ప్రియా వడ్లమాని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. ఆ తర్వాత పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. భాగ్యనగరంలోని స్లేట్ స్కూల్‌లో చదివిన తర్వాత బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ క్రైస్ట్ కాలేజీలో చదువును పూర్తి చేసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తుంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ టూ హీరోయిన్ అయిన ఈ బామకు ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకి మూడు లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

నెట్టింట ఈ చిన్నది ట్రెండీ దుస్తులతో కనిపిస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంటుంది. మత్తెక్కించే కళ్లు, అందాల వయ్యారాలు కలగలిపి ప్రియా వడ్లమాని ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ లుక్స్ అందర్నీ కట్టిపడేస్తాయి. డ్యాన్స్ పై ఇష్టంతో ఈమె చిన్నప్పుడే కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకుని కొన్ని షోలలో కూడా పెర్ఫార్మ్ చేసింది. శ్రీవిష్ణు మూవీ ఓం భీమ్ బుష్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మనుచరిత్ర లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈమె చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: