అలనాటి హీరోలు చేసిన ఏ సినిమా అయినా ఓ అద్భుతం అని చెప్పాలి. అక్కినేని, ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఓ దృశ్యకావ్యం కనిపించేది. మహాకవి కాళిదాసు, భక్తతుకారాం, భక్త జయదేవ లాంటి సినిమాల జాబితాలో 1976లో వచ్చిన మహాకవి క్షేత్రయ్య కూడా ఎంతో పాపులర్ అయ్యింది. కాళిదాసు లాగానే క్షేత్రయ్య కూడా అంతగా చదువును కొనసాగించలేకపోయాడు. అయితేమాత్రం ఆయనొక గొప్ప వాగ్గేయకారుడయ్యాడు. క్షేత్రయ్య వాడే పదాలు అద్భుతంగా ఉంటాయి. శృంగార రసంతో భక్తిని చాటుకోవడంలో ఆయన దిట్ట అని చెప్పొచ్చు. 17వ శతాబ్దానికి సంబంధించిన వాగ్గేయకారుడిగా క్షేత్రయ్య ఫేమస్ అయ్యారు.

క్షేత్రయ్య గురించి ఎన్నో కథలు వాడుకలో ఉండేవి. వాటి ఆధారంగా ఆరుద్ర, నిర్మాత ఆదినారాయణరావులు మంచి కథను కూడా సిద్ధం చేసుకున్నారు. సినిమా అంతా కూడా మంచి మంచి పదాలను వాడారు. అందులోని పాటలు, నృత్యాలు ఇలా ప్రతి ఒక్కటీ అద్భుతంగా పండాయి. అయితే మాత్రం ఆ మూవీ అంతగా ఆదరణ పొందలేదు. కానీ కళాభిమానులకు, పండితులకు ఆ మూవీ ఓ పాఠంలా పనిచేసింది. అందులో రామకృష్ణ, సుశీలమ్మ పాడిన జాబిల్లి చూసేను నిన్ను నన్ను అనే పాట బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత మేలుకో కవిరాజా అనే పాటలో రాధాకృష్ణుల నృత్యం చాలా గొప్పగా చూపించారు. నజరానా అనే పాటలో కూడా జయసుధ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

అంజలీదేవి నటించిన రంగాజమ్మ పాత్ర అద్భుతం అని చెప్పాలి. ఇక మంజుల ఇందులో దేవదాసిగా, కూచిపూడి డ్యాన్సర్‌గా చేసింది. ఈ మూవీలో అక్కినేనితో ఆమె సమానంగా నటించిందని చెప్పాలి. గొప్పగొప్ప నటీనటులంతా ఇందులో నటించారు. రాజబాబు, రావి కొండలరావు, కాంతారావు, రావు గోపాలరావు వంటివారు తమ నటనను పండించారు. అందుకే ఈ మూవీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. సిల్వర్ మెడల్ ఇచ్చి సత్కరించింది. యూట్యూబ్‌లో ఉన్న మహాకవి క్షేత్రయ్య మూవీని చూడకుంటే మీరు కూడా చూసేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: