నటి సరిత తన మాజీ భర్త ముఖేశ్ ఎలాంటివాడు చెబుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. తన భర్త కనిపించేంత మంచి మనిషి కాదని, క్యారెక్టర్ లేని మనిషని చెప్పుకొచ్చింది. ఎదుటివారికి గౌరవం ఇవ్వలేని వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యాడని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తన తండ్రి ముందే తాగేవాడని, నిత్యం తనను వేధించేవాడని తెలిపింది. రాత్రి వేళల్లోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు అమ్మాయిలను వెంటేసుకుని ఇంటికొచ్చేవాడని, పనివాళ్ల ముందు జుట్టు పట్టుకుని కొట్టేవాడని చెప్పింది.
తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కాలితో కడుపు తన్నాడని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని సరిత తెలిపింది. అలాంటి వ్యక్తిని సమాజం నమ్మి అందలం ఎక్కించడం ఏంటని సరిత ప్రశ్నించింది. ముఖేశ్ ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలను నిర్మించారు కూడా. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి నాయకులు ఉన్నందు వల్లే చాలా మంది ఆడవాళ్లు వేధింపులకు గురవుతున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి తన మాజీ భర్తపై సరిత చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.