ఆయన సినిమా తీస్తున్నాడు అంటే చాలు ఇండస్ట్రీ రికార్డులు కూడా భయపడేవి  ఎందుకంటే ఎక్కడ బద్దలు అవ్వాల్సి వస్తుందో అని. ఆయన సినిమా తీస్తున్నాడు అంటే మిగతా స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా పోటీ నుంచి తప్పుకునేవారు. ఎందుకంటే ఆయన సినిమా సృష్టించే ప్రభంజనం ముందు తమ సినిమాలు ఫ్లాప్ గా మిగిలిపోతాయేమో అని. ఆయన సినిమా తీస్తున్నాడు అంటే స్టార్ హీరోలు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయనతో చేసిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని.


 ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ థియేటర్లకు బాలు తీరే వారు ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉండే కిక్ అలాంటిది. కానీ ఇప్పుడు ఆయన సినిమానే ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఆయన సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడిపోతుంది. ఆయన సినిమానే నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు ఆయనతో సినిమా తీయడానికి ఎగబడ్డ హీరోలు సైతం ఇప్పుడు ఆ డైరెక్టర్ తో సినిమా అంటే చాలు వెనకడుగు వేస్తున్నారు. అంతలా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన ఎవరో కాదు ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి బాక్సాఫీస్ ను ఊపేసిన పూరి జగన్నాథ్. అతి తక్కువ సమయంలో సినిమాలు తీసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన.. ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చి మాస్ ఫాలోయింగ్ పెంచేసిన ఆయన ఇక ఇప్పుడు మాత్రం వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు.


 గత కొంతకాలం నుంచి పూరి జగన్నాథ్ తీసిన ఏ సినిమా కూడా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. లైగర్ లాంటి అట్టర్ ప్లాప్ తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై అభిమానులే కాదు.. డైరెక్టర్ పూరి కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. దీంతో పూరి దర్శకత్వంలో పస తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సినిమాలో ఆయన స్టైల్ మిస్ అవుతుందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు సినిమాల్లో పూరి తరహా ట్రేడ్ మార్క్ డైలాగులు మిస్ అవుతున్నాయని.. అందుకే రానున్న రోజుల్లో సరికొత్త కథతో తనదైన స్టైల్ మేకింగ్ తో వస్తే తప్ప కమ్ బ్యాక్ ఇవ్వడం కష్టమే అంటూ అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: