తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలం వరస పెట్టి అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైనా స్టార్ హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన ఏదో ఒక సినిమాను థియేటర్లలో రీ రిలీస్ చేస్తున్నారు. ఇక ఫాన్స్ కూడా ఆ హీరో పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఆ సినిమాను ఎగబడి చూస్తున్నారు. దానితో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి మూవీ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీస్ చేయగా ఆ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. 

ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర సినిమా రీ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 28 వ తేదీన మాస్ మూవీ ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన చాలా సినిమాలకు బుకింగ్స్ ఓపెన్ కాగానే అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది.

అలా వచ్చిన సినిమాలకు కలెక్షన్లు భారీగా వచ్చాయి. మరి మాస్ సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నట్లు అయితే ఈ మూవీ కూడా భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది. మరి నాగార్జున మాస్ మూవీ రీ రిలీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: