సింగర్ నోయల్ మాజీ భార్య ఎస్తేర్ గురించి సోషల్ మీడియాలో చాలా న్యూస్ వైరల్ అవుతాయి.అంతేకాకుండా నోయల్ ఈ విషయం గురించి ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.కానీ ఇదంతా దొంగ ఏడుపులేనని,అంతా పబ్లిసిటీ కోసమేనని ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ చెప్పింది.అంతేకాదు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఆ ఇంటర్వ్యూలో కచ్చితంగా నోయల్ తో డివోర్స్ కి కారణం అడుగుతారు ఎస్తేర్ ని. ఈ విషయంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది ఎస్తేర్. ఇక స్తేర్ కి సంబంధించిన ఏదైనా సినిమా విడుదలయితే చాలు ఆ సినిమా ప్రమోషన్స్ లో కచ్చితంగా ఈ ప్రశ్న  ఉంటుంది. ఇక ఎస్తేర్ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతుంది.ఇందులో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి నోయల్ తో విడాకుల గురించి ఓపెన్ అయింది.అయితే నోయల్ ని 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తేర్ కొన్ని నెలల్లోనే విడాకులు ఇచ్చేసింది. పెళ్లయిన 16 రోజులకే దూరంగా వచ్చేసింది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. 

ఇక వీరికి పెళ్లి అయిన ఏడాదిలోపే విడాకులు అయ్యాయి. అయితే ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఎస్తేర్ మాట్లాడుతూ.. చాలామంది పెళ్లికి సంబంధించిన ఎన్నో  పనులు సిద్ధం చేసి పెళ్లి రేపు జరుగుతుంది అనగా ఏదైనా విషయం బయటపడితే దానికి సంబంధించి పెళ్లయ్యాక చూసుకుందాంలే.. తర్వాత మారతారులే అని అనుకుంటారు. కానీ పెళ్లయ్యాక కూడా అదే తంతు కనిపిస్తే మళ్లీ వారితో రిలేషన్ కొనసాగించడం అసాధ్యం. అయితే ఒకసారి అయితే ఏదో తెలియక చేశారులే తప్పని క్షమించవచ్చు.కానీ పదే పదే తప్పని తెలిసి కూడా అదే పని చేస్తే వారు కావాలనే మనతో గేమ్ ఆడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.ఈ విషయాన్ని నేను పెళ్లైన మొదట్లోనే గమనించాను.. కొంతమందిని క్షమిస్తే మారుతారలే అని ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

కానీ వాళ్లు మన క్షమాగుణాన్ని బలహీనతగా చేసుకొని పదేపదే అదే తప్పు చేస్తే వాళ్ళని క్షమించడం మనకే మంచిది కాదు.  మనం ఎన్ని తప్పులు చేసినా కూడా వారిని క్షమిస్తున్నామని  తెలిసి వారి ప్రవర్తనలో మార్పు రావాలి.కానీ ఎప్పుడూ అదే పని చేస్తూ ఉంటే వాళ్లు జీవితంలో ఎప్పటికీ మారరని అర్థం చేసుకోవాలి. అయితే చూడడానికి బయటకి బాగానే కనిపిస్తారు.కానీ వారితో జీవించే వారికి వారి గురించి అసలు నిజం తెలుస్తుంది అంటూ సింగర్ నోయల్ తో విడాకుల గురించి సంచలన కామెంట్లు చేసింది నటి ఎస్తేర్. ఇక ఈమె మాటలు విన్న చాలా మంది నెటిజన్స్  నోయల్ వేరే అమ్మాయితో ఉన్న సమయంలో ఎస్తేర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది కాబట్టే ఆమె ఇంతలా డిప్రెషన్ లోకి వెళ్లి విడాకులు తీసుకుంది అని కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: