జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాను మొదలు పెట్టిన సమయంలో కేవలం ఒక భాగంన్గానే మొదలు పెట్టారు . కానీ ఆ తర్వాత ఈ మూవీ దర్శకుడు కొరటాల శివసినిమా కథ పెద్దది అందు కోసం ఈ సినిమాను ఒక్క భాగంలో చెప్పడం కుదరదు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాం అని ప్రకటించాడు. ఇక ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఫుల్ స్పీడ్ గా ఈ సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేస్తూ వస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి ఈ మూవీ ప్రమోషన్  లను మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దేవర సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... దేవర సినిమాకు సంబంధించిన షో లు ఇండియాలో సెప్టెంబర్ 27 వ తేదీన అర్ధరాత్రి 1 : 08 నిమిషాల నుండే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: