గత 24 గంటల నుండి అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఇంటి నుండి బయటికి వచ్చి తన ఇంటిని,ఆఫీస్ ని మాదాపూర్ దగ్గరలో ఉన్న వెంకటగిరి లోని ఒక కాస్ట్లీ ఇంటిలోకి మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ లగ్జరీ బిల్డింగ్ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ కి దగ్గర్లోనే ఉంది అని, అలాగే  ఈ ఇల్లు సమీపంలో దివంగత నటుడు కృష్ణంరాజు ఇల్లు కూడా ఉందని తెలుస్తుంది.అయితే ఆ లగ్జరీ ఇల్లుని రీసెంట్ గానే అల్లు అర్జున్ కొనుగోలు చేశారట. ఇక ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఇల్లుకు తుదిమెరుగులు దిద్ది త్వరలోనే భార్య పిల్లలతో కలిసి అల్లు అర్జున్ గృహప్రవేశం చేయబోతున్నట్టు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు వ్యతిరేకంగా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.

అదేంటంటే.. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అర్జున్ తో ఓ విషయంలో గొడవ పెట్టుకొని ఇంటి నుండి బయటకు వచ్చేసి తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం పెట్టబోతున్నట్టు. దానికి కారణం ఏంటంటే.. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని ఎన్ని వార్తలు వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ని ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టమని అల్లు అరవింద్ కాస్త మందలించారట. కానీ బన్నీ మాత్రం నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు వీటికి పులిస్టాప్ పెడతాను.వాళ్లే ఎక్కువ చేస్తున్నారు అని తండ్రితో గట్టిగా మాట్లాడారట.

దాంతో అల్లు అరవింద్ బన్నీపై ఫైర్ అయ్యారట.ఈ విషయంలో తండ్రితో గొడవలు తారా స్థాయికి చేరడంతో స్నేహ రెడ్డి,పిల్లలతో కలిసి ఆయన వేరే ఇంట్లోకి మకాం మార్చాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇదే విషయాన్ని ఫిలిం సర్కిల్స్లో అల్లు అర్జున్ కొత్త ఇంటికి మారబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ కొంతమంది టాలీవుడ్ జనాలు మాత్రం మెగా ఫ్యామిలీ విషయంలో అల్లు అర్జున్ కి అల్లు అరవింద్ కి గొడవ రావడం వల్ల ఆయన ఇంటి నుండి బయటకు వస్తున్నారు అనే రూమర్ వినిపిస్తుంది. మరి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ రూమర్ లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: