మెగాస్టార్ చిరంజీవితో యూవీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంట‌సీ కథ‌ నేపథ్యంలో మల్లిడి వశిష్ట్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. మెల్లమెల్లగా ఈ సినిమా మార్కెట్ కూడా మొదలుపెట్టేశారు. హోల్సేల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు.. నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి అమ్మేసే దిశ‌గా కూడా చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. నిర్మాతలు ఏకంగా రూ.120 కోట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్ దేవర కన్నా చాలా ఎక్కువ మొత్తం అని చెప్పాలి. ఈ రేటు మీద డిస్కషన్ కూడా నడుస్తున్నాయి.


ఓ యంగ్ ప్రొడ్యూసర్ కమ్‌ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా ఏపీ, తెలంగాణ హోల్సేల్ హక్కులు తీసుకునేందుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. అంత రేటు అయితే తాము భరించలేం.. తగ్గించాలని భేరసారాలు నడుపుతున్నారట. రూ.120 కోట్లు అంటే ఆంధ్ర రూ.60 కోట్లకు అమ్మాల్సి ఉంటుంది. నైజాం రూ.45 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. కానీ.. ఇంత రేటు రావాలంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇక్కడ ఈ సినిమాకు ఉన్న ఆశలు ఏంటంటే.. సంక్రాంతికి వస్తుంది. పైగా మెగాస్టార్ సినిమా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తుంది.


రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య, బాలయ్య.. వీరసింహారెడ్డి సినిమాతో పోటీపడి మరి రూ.110 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమా కంటే మరో రూ.10 కోట్లు ఎక్కువగా రూ.120 కోట్లు కావాలని నిర్మాతలు పట్టుబడుతున్నారు. సంక్రాంతి వస్తుంది టికెట్ రేట్లు పెంపు పెద్ద కష్టం కాదు. అందుకే అంత భారీ రేటు అడుగుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు మంచి రేటుకు అమ్మేశారు. ఏది ఏమైనా సంక్రాంతి బాలయ్య సినిమా కూడా పోటీలో ఉంటుంది. చిరంజీవి సినిమాకు రూ.120 కోట్ల షేర్ రావడం అంటే మామూలు రిస్క్ కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: