టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో నారా రోహిత్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి కమర్షియల్ సినిమాలలో కాకుండా ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలలోనే నటిస్తూ వచ్చాడు. దానితో ఈయనకు పెద్దగా హిట్లు లేకపోయిన నటుడిగా మంచి గుర్తింపు మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం నారా రోహిత్ "ప్రతినిధి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా "ప్రతినిధి 2" అనే మూవీని రూపొందించారు. ఇందులో కూడా నారా రోహిత్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం నారా రోహిత్ "సుందరకాండ" అనే సినిమాలో హీరో గా నటించాడు. నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ విడుదల కోసం ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా పాత్రికేయలతో ముచ్చటంచిన నారా రోహిత్ కు "ప్రతినిధి 2" హిట్ అయింది కదా "ప్రతినిధి 3" తీస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

దీనితో నారా రోహిత్ "ప్రతినిధి 2" హిట్ అయ్యిందా..? ఎక్కడ హిట్ అయింది. అది వచ్చింది ... పోయింది కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అన్నాడు. అది ఏంటి సార్ హిట్ అయింది అని పాత్రికేయులు అనగా ... నారా రోహిత్ అది ఫ్లాప్ అయ్యింది. మీరు మరి అన్ని సార్లు అనడం వల్ల సినిమా వచ్చింది అని తెలుస్తుంది. కానీ ఆ సినిమా వచ్చినట్టు కూడా పెద్దగా తెలియడం లేదు అని తాను నటించిన సినిమాలు తానే ఫ్లాప్ అని నారా రోహిత్ ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: