ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలలో దేవర సినిమా థియేటర్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు కొనుగోలు చేశారట. యూకేలో పీకాడిల్లి అనే మల్టీప్లెక్స్ లో దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి. దీంతో అభిమానుల సైతం ఫస్ట్ షో టికెట్లు కొనేందుకు సిద్ధమైపోయి సోషల్ మీడియా వేదికగా వాటికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇతరానికి సంబంధించి బెన్ ఫిట్ షో కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.
అభిమానుల కోసం సెప్టెంబర్ 27వ తేదీన తెల్లవారుజామునే 1:08 గంటలకు బెనిఫిట్ షో ఉండేలా చిత్ర బృందం పలు రకాలుగా సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకే సమయంలోనే ఈ బెనిఫిట్ షోలు వేయబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన విషయాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టిస్తుందని అభిమానులైతే ధీమాతో ఉంటున్నారు. ఇక రెండవ భాగం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదట. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలను లైన్లో పెట్టడం వల్ల సీక్వెల్ లేటుగానే మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.