టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభించినప్పటి నుండి చాలా సంవత్సరాల పాటు కేవలం కామెడీ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు. ఫోకస్ పెట్టడం మాత్రమే కాకుండా వరుసగా అలాంటి సినిమాలలో నటిస్తూ చాలా విజయాలను కూడా అందుకున్నాడు. ఈయన దాదాపుగా సంవత్సరానికి ఒకటి , రెండు కామెడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందులో చాలా సినిమాలతో మంచి విజయాలు అందుకుంటూ కెరియర్ ను చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగించాడు.

ఇకపోతే ఈయన 2012 వ సంవత్సరం భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సుడిగాడు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఆ సమయంలో ఈ మూవీ 18 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్ ఎన్ని కామెడీ సినిమాలో నటించిన ఒక్క మూవీ కూడా మంచి విజయం అందుకోలేదు. 18 కోట్ల షేర్ కలక్షన్ లను పక్కన పెడితే కొన్ని సంవత్సరాల పాటు అల్లరి నరేష్ కు 5 , 6 కోట్ల షేర్ కలక్షన్ లు వచ్చిన సినిమాలు కూడా రాలేదు. ఇక నాంది మూవీ తో ఈయనకు దాదాపు 10 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. దానితో ఈయన మళ్ళీ వైవిధ్యమైన సినిమాల వైపు దృష్టి పెట్టడం మొదలు పెట్టాడు.

కానీ అక్కడ కూడా ఈయనకు నిరాశే మిగిలింది. కొంత కాలం క్రితం అల్లరి నరేష్ "ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా 2012 వ సంవత్సరం సుడిగాడు సినిమాతో 18 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ కలెక్షన్లను రాబట్ట లేకపోతున్నాడు. మరి అల్లరి నరేష్ ఎప్పుడు సుడిగాడు కంటే మించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: