టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈమె శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత దమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ధమాకా సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలోను తన నటనతో కంటే కూడా అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు క్రేజీ సినిమాలలో అవకాశాలు వరసగా దక్కుతూ వస్తున్నాయి. 

ఆఖరుగా ఈమె నటించిన గుంటూరు కారం సినిమా విడుదల అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: