టాలీవుడ్ న‌టి శోభిత ధూళిపాళ్ల‌ మ‌రికొన్ని రోజుల్లో అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ భామ పెళ్లి కాక‌ముందే ఫ్యూచ‌ర్‌లో తన సినిమాలు ఎలా ఉండాలో డిసైడ్ చేసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే సినిమాల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇకపోతే అక్కినేని వారి ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతోంది శోభిత ధూళిపాళ. నాగచైతన్యతో గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరగగా, ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోనున్నారని వార్తలు

 వస్తున్నాయి. అంతేకాకుండా ఈ జంట డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పారిస్‌లో చై, శోభితల వివాహం జరగబోతోందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శోభితకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈమె బాలీవుడ్ హీరో సినిమాలో.. ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. బాలీవుడ్లో డాన్ సిరీస్ కి ఎనలేని క్రేజ్ దక్కింది .మొదటి రెండు భాగాలలో షారుక్ ఖాన్ నటించగా.. మూడవ భాగంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈయన పక్కన శోభిత ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు

 వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని ఫ్యామిలీకి ఇది భారీ షాక్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో సమంత కూడా ఐటమ్ సాంగ్ చేసిందననే కారణంగానే నాగచైతన్య విడాకులు.. తీసుకున్నారనే ప్రచారం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో శోభిత ఐటమ్ సాంగ్ లో నటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: