టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరో నితిన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లోనే క్రేజీ హీరో నితిన్ అని చెప్పవచ్చు. 1983 మార్చి 30వ తేదీన నిజామాబాద్ లో జన్మించారు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే హీరోగా ప్రయత్నాలు చేశాడు.


బీటెక్ చదువుతున్న రోజుల్లోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 2002 సంవత్సరంలో డైరెక్టర్ తేజ రూపొందించిన జయం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతోనే వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్‌. ఆ సినిమా సమయంలో నితిన్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.


ఆ తర్వాత దిల్, సంబరం, శ్రీ ఆంజనేయం వంటి చిత్రాలతో అదరగొట్టగలిగాడు మన హీరో నితిన్‌. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఆ తర్వాత అదే స్థాయిలో హిట్స్ సంపాదించలేకపోయాడు. నితిన్ కెరీర్లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ సినిమా చాలా ప్రత్యేకం. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ వుడ్ సినిమాలో నటిస్తున్నారు.


తాజాగా ఇప్పుడు టాలీవుడ్ హీరో నితిన్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో ఆకట్టుకున్నాయి. పైన ఫోటోలు చూశారు కదా. అందులో తన తండ్రితో పాటు ఎంతో ముందుగా కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో కాదు నితిన్. హిట్లుఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు నితిన్. అయితే.. ఈ మధ్య కాలంలో హీరో నితన్‌ కు సరైన సక్సెస్‌ అందలేదన్న సంగతి తెలిసిందే. సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు హీరో నితిన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: