వరస అవకాశాలతో తెలుగు ప్రేక్షకులు అందరిని తన వైపు తిప్పుకుంది శ్రీలీల. ఒకేసారి 9 సినిమాలు సైన్ చేసి.. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తన అందం.‌..అభినయం వల్ల మహేష్ బాబు గుంటూరు కారం.‌ పవన్ కళ్యాణ్ ఉస్టాడ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలలో కూడా అవకాశం అందుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. శ్రీలీల నటించిన.. భగవంత్ కేసరి ఆమెకు మంచి పేరు.. తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో తాను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలనని రుజువు చేసుకుంది. అయితే ఆ తరువాత మెగా కాంపౌండ్ హీరో వైష్ణవి తేజ్ తో ఈ హీరోయిన్ చేసిన..

ఆది కేశవ ఆమె కెరియర్ పై పెద్ద దెబ్బ కొట్టింది. శ్రీలీల అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటుంది అనేటట్లు.. అనుమానాలు క్రియేట్ చేసింది.  కానీ టాలీవుడ్ లో శ్రీలీల హిట్ రేషియో చూసుకుంటే తక్కువ అనే చెప్పాలి.వరుస ఫ్లాప్ లు పలకరించడంతో ఇటీవల తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు తాగ్గాయి. దీంతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీ వైపు ద్రుష్టి మళ్లించింది. ఆ మధ్య తమిళ స్టార్ హీరోలకు జోడిగా శ్రీలీల పేరు వినిపించింది కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ ఇప్పుడు తమిళంలో ఛాన్స్ కొట్టేసింది ఈ యంగ్ డాల్. శివకార్తికేయన్ హీరోగా ఆకాశమే హద్దురా,

గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో 'పురాణనూరు' అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా శ్రీలీలను ఫిక్స్ చేశారు. ఇందుకు సంభందించి ఫోటో షూట్ కూడా కంప్లిట్ చేసారు. త్వరలోనే అధికారక ప్రకటన రెండు మూడు రోజుల్లో రానుంది. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. కన్నడ, టాలీవుడ్ లో మెప్పించిన శ్రీలీల కోలీవుడ్ లో ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: