తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూలై 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ టోటల్ గా కంప్లీట్ అయింది. మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి మొత్తంగా ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.82 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.66 కోట్లు , ఈస్ట్ లో 96 లక్షలు , వెస్టు లో 65 లక్షలు , గుంటూరులో 1.17 కోట్లు , కృష్ణ లో 94 లక్షలు , నెల్లూరు లో 50 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.75 కోట్ల షేర్ ... 24.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ కి 11.25 కోట్ల నష్టాలు వచ్చాయి. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిజాస్టర్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: