ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి ఆఖరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ కి ఎన్నో జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు కూడా లభించాయి. ఏకంగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. దానితో ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఆర్ ఆర్ ఆర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత రాజమౌళి , మహేష్ బాబు హీరో గా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చాలా రోజుల నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టిన రాజమౌళి ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఆల్మోస్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి రాజమౌళి ఇంకా కాస్త సమయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తీసుకు వెళ్లడానికి ఆయన ఈ మూవీ ప్రారంభం అయ్యే టైమ్ కే కొన్ని హాలీవుడ్ సంస్థలతో ఒప్పందం చేసుకోబోతున్నట్లు , అలా ఏదైనా ఒక మంచి హాలీవుడ్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ మూవీ ని స్టార్ట్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా రాజమౌళిసినిమా విషయంలో మొదటి నుండి హాలీవుడ్ మార్కెట్ ను దృష్టి లో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే మహేష్ బాబు కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: