కొంతమంది హీరోయిన్స్ అందం అభినయంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా పొందలేరు. నటించిన ఫస్ట్ సినిమా హిట్ తో అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ సక్సెస్ కాలేకపోయింది. స్టార్‌ హీరోల సరసన నటించింది కానీ.. స్టార్‌ కాలేకపోయింది. అందం ఉంది కానీ అదృష్టం లేకుండా పోయింది. ఈ హీరోయిన్ ఎవరో ఈ పాటే అర్ధమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు అందరూ ముద్దుగా అనూ బేబీ అని పిలిపించుకునే అను ఇమ్మాన్యుయేల్...తెలుగులో నాని హీరోగా వచ్చిన 'మజ్ను' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా స్టార్ హీరోల పక్కన అవకాశాలు తెచ్చిపెట్టింది కానీ.. సక్సెస్‌ను మాత్రం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 'అజ్ఞాతవాసి' సినిమా చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజెన్' చిత్రాలలో నటించిన ఏ చిత్రమూ ఆడలేదు. దాంతో ఆమె కెరీర్ అయోమయంలో పడింది. తెలుగులో మరో ప్రయత్నంగా నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ముందుకొచ్చింది. కానీ ఈసారి కూడా పరాజయమే వెక్కిరించింది ఈ బేబీకి. ఇక తమిళంలో ఆమె నటించిన 'తుప్పారివాల' తెలుగులో 'డిటెక్టివ్'గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి హిట్ గా నిలిచింది. అందం అభినయం ఉన్నా ఏం లాభం.. అదృష్టం లేకుండా పోయింది.ఈ క్రమంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే బాగుంటుందని ఎంతో మంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. 

అయితే ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం అల్లు అర్జున్ తో నటించి చాలా పెద్ద తప్పు చేశానంటూ బాధపడిందట. బన్నీ సినిమా కారణంగా ఎన్నొ ఇబ్బందులు పడిందట.. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఆమె టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మనుయ్యేల్.అనూ.. బన్నీ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో సినిమా ఆక్టర్ ప్లాప్ అవ్వడానికి కారణం అను ఇమ్మనుయ్యేల్ అంటూ.. బన్నీ ఫ్యాన్స్ అంతా ఆమెను విపరీతంగా తిట్టిపోశారట. ఆమెను ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారట. దీంతో అను ఇమాన్యుల్ చాలా ఇబ్బంది పడిందని.. మానసికంగా ఎంతో బాధపడిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలు నటించకుండా ఉండి ఉంటే బాగుండేది.. ఈ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశానంటూ.. సన్నిహితులతో కూడా చెప్పుకొచ్చిందట. అప్పట్లో ఈ న్యూస్‌ తెగ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం అను ఇమ్మనుయ్యేల్ టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో కొలువుడ్ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.మరి ఇప్పటికైనా మంచి అవకాశాలు అనూ బేబీ తలుపు కొడతాయేమో చూడాలి. అయితే సోషల్ మీడియాలో అందాలను బహిర్గతం చేస్తూ పోస్ట్ చేస్తూ హీట్ పెంచుతోంది అను. ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: