యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.ఆర్ఆర్ఆర్' తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.తారక్ సినిమా కోసం ఇప్పటికే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వెండి తెరపై తారక్ కనిపించి చాలా రోజులు అవ్వడంతో .. అభిమానులు ఆశలు రోజు రోజుకి మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్, ప్రతి సాంగ్ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది 'ఆర్ఆర్ఆర్' తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ అందరికి.. హైప్ క్రియేట్ చేసింది.. ఫియర్ సాంగ్ తో దేవర ముందర నువ్వెంత అంటూ.. భయాన్నే భయపెట్టే వాడే దేవర అంటూ.. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ గురించి హైప్ నడుస్తూనే ఉంది. ఇక ఇప్పుడు  ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. 'ది ఫేసెస్ ఆఫ్ ఫియర్' అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.

ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయంలో కనిపించనున్నాడా అనే కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుదల అయిన తరువాతనే దీనిపై స్పష్టత రానుంది.చూడబోతుంటే సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. ఇలాంటి పోస్టర్స్ రివీల్ చేసి.. రిలీజ్ లోపల వారిని ఎంగేజింగ్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. థియేట్రికల్ రిలీజ్ ఎంతో సమయం లేదు కాబట్టి.. దేవర టీమ్ త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ నుంచి ఇంకా ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.. అవి సినిమాపై ఎలాంటి అంచనాలను పెంచుతాయో వేచి చూడాలి.ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, శృతి మరాథే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయారాసన్, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. రెండు లిరికల్ సాంగ్స్ సైతం రికార్డు వ్యూస్ సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: