ఇక తాజాగా పవన్ కళ్యాణ్ స్మగ్లర్లు హీరోలు అవడం ఏంటి..? అనటం ఆ వెంటనే బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడటం.. పవన్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని చెప్పటం.. అంతకు ముందు బన్నీ నా మనసుకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తా అనటం.. ఇలా ఒకటి కాదు.. ఇటు పవన్ కళ్యాణ్, అటు బన్నీ, బన్నీ మామ ఎలా మాట్లాడినా మెగా ఫ్యామిలీలో ఏవేవో ఉన్నాయన్న అపోహలు అయితే బయటకు వచ్చేసాయి. ఏది ఏమైనా చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య గతంలో ఉన్నంత బలమైన బంధం లేదని అంటున్నారు. బన్నీ మాత్రమే కాదు అల్లు అరవింద్ కూడా చిరంజీవి మెగా కాంపౌండ్ కు దూరంగా వెళుతున్న వాతావరణం కనిపిస్తుంది.
ఇప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఒకటి అవుతున్నారు. బన్నీ చేస్తున్న కామెంట్లు కూడా మెగా, అల్లు కుటుంబాల మధ్య ఇప్పటికే ఉన్న గ్యాప్ ను.. మరింత పెంచేలా ఉన్నాయి. ఈ ఫ్యామిలీ చరిత్ర ఇలా ఉంటే.. అటు నందమూరి కుటుంబంలోనూ.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి తెలిసిందే. బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ సెప్టెంబర్ 1వ తేదీన ఓ పెద్ద ఈవెంట్ చేస్తుంది. చిరంజీవిని కూడా ఆహ్వానించారు. దానికి జూనియర్ ఎన్టీఆర్‌ను పిలుస్తారా..?పిలవరా..? అన్న చర్చలు మొదలయ్యాయి.
బాలయ్యకు అయితే ఎన్టీఆర్‌ను పిలవడం పట్ల పెద్దగా ఆసక్తి లేదని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబానికి దూరం దూరంగా ఉంటున్నాడు. పైగా తన సోదరి నందమూరి సుహాసినికి కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా.. ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ అసలు ప్రచారానికి వెళ్ళలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్.. దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు బాలయ్యను ఎన్టీఆర్ పిలుస్తాడా..? అంటే కచ్చితంగా పిలవడనే చెప్పాలి. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ లో నడుస్తున్న ఈ కోల్డ్ వార్‌లు ఇప్పుడు తెలుగు మీడియాలో, తెలుగు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి అన్నది వాస్తవం.