తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వెట్టైయాన్’ చిత్రాన్ని రిలీజ్‌కి రెడీ చేసిన రజినీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ కోసం రజినీకాంత్ వైజాగ్ చేరుకున్నాడు. అయితే, ఆయన వైజాగ్‌కు రావడంతో టాలీవుడ్ దర్శకుడు శివ నిర్వాణ ఆయన్ను అనుకోకుండా కలిశారు. దీంతో శివ నిర్వాణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన సూపర్ స్టార్ కళ్ల ముందర కనిపించడంతో ఒక్కసారిగా ఫోన్ కెమెరాకు పని చెప్పారు.

ఇక ఈ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇదిలాఉండగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ భారీ ముల్టీస్టారర్ తెరకెక్కుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జరుగుతుంది. అయితే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తోంది. ఈ వార్త అక్కడ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది అదే జరిగితే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని చర్చించుకుంటున్నాయి తమిళ సినిమా వర్గాలు.

మరోవైపు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూలీ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా నటిస్తున్నాడని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే అమీర్ ఖాన్ వార్త పై అధికారక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి సంచలం నమోదు చేసిందో చూసాం. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలు మళ్ళి ఉపందుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: