కింగ్ నాగార్జున నటించిన ‘మాస్’ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నాగార్జున కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీ ఫాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టేది. అయితే ఆయన పుట్టినరోజు కానుకగా మాస్ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున అభిమానులకు ఇది పండగ వాతావరణం అని చెప్పవచ్చు. తన  'మాస్' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నాగార్జున భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో అభిమానులు ఉత్సాహంతో నిండిపోయారు.

అంతే కాకుండా ఈ కటౌట్‌లో నాగార్జున తనదైన స్టైల్‌లో కనిపిస్తున్నారు. ‘మాస్’ సినిమాలోని ఓ యాక్షన్ సీన్‌ను ఈ కటౌట్‌లో చూపించడం విశేషం అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ కటౌట్ ఫోటోలు వైరల్ అవుతుండటంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. కటౌట్ వద్ద సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాగార్జున అభిమానులు తమ స్టార్‌ను ఎంతగా ప్రేమిస్తారో ఈ కటౌట్ ద్వారా స్పష్టమవుతోంది. ఇది ఇలా ఉంటే 'మాస్' చిత్రం నాగార్జున కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. నాగార్జున కటౌట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇకపోతే  ఈ చిత్రంలో నాగార్జున కొత్త లుక్‌లో కనిపించనున్నారు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగార్జున తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ప్రతి సినిమాలలో ఎప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 'మాస్' చిత్రం కూడా ఆయన కెరీర్‌లో మరో సారి  బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 28న రీ-రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: