తెలుగు సినీ పరిశ్రమలో డిఫెరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, ఎప్పటికప్పుడు వైవిధ్యం కనబరుస్తూ చేసే నటుడు నాచురల్ స్టార్ నాని. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో రెండు సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఈ ఆగస్టు 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని.దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం మంచి హైప్ ను సొంతం చేసుకుంది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచాయి. నాని కూడా సినిమాను అన్ని చోట్లా ప్రమోట్ చేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు.అంటే సుందరానికీ' వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'సరిపోదా శనివారం' ఆగస్టు 29న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.

'సరిపోదా శనివారం' చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అభ్యంతరకమైన ఒక పదాన్ని మ్యూట్ చేశారు. ఈ మూవీ రన్ టైంని 174 నిమిషాల 37 సెకన్లు(2 గంటల 54 నిమిషాల 37 సెకన్లు)గా టీం లాక్ చేసింది.అంటే దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో అడుగుపెడుతోంది. నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన గత చిత్రం 'అంటే సుందరానికీ' కూడా ఇంచుమించు ఇదే నిడివితో వచ్చింది. అయితే ఆ అధిక నిడివి కారణంగానే.. ఆ సినిమా ఆశించినస్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందనే అభిప్రాయాలున్నాయి.అయినప్పటికీ ఇప్పుడు 'సరిపోదా శనివారం'కి కూడా దాదాపు మూడు గంటల నిడివి లాక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇది గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ అని, ఎక్కడా బోర్ కొట్టకుండా రన్ అవుతుందని.. కాబట్టి నిడివి అసలు సమస్యే కాదని అంటున్నారు. సెన్సార్ టాక్ కూడా అదే చెబుతోంది. మూవీ అవుట్ పుట్ బాగుందని, నాని-వివేక్ కాంబో మంచి హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: