ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో 'దేవర' చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకి మార్కెట్ లో రోజురోజుకి క్రేజ్ పెరుగుతూ వెళ్తుంది. వచ్చే నెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఇప్పటి నుండి ఫ్యాన్ షోస్ ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే లండన్ లో పలు లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, 3 వేల పౌండ్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ కూడా కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా షోస్ మార్చి 27 అర్థ రాత్రి 1 గంట నుండి ప్రారంభం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అభిమానుల నుండి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియన్ ఆడియన్స్ ని షేక్ చేసే మరో పాటని సినిమా విడుదలకు వారం రోజుల ముందు విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. ‘ఆయుధ పూజ’ అని పిలవబడుతున్న ఈ పాట విడుదలయ్యాక ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలను ఫ్యాన్స్ మర్చిపోతారని, ఆ స్థాయిలో ఆ పాట ఉంటుందని అంటున్నారు.
 

సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ సైతం ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర మూవీ నుంచి గ్లింప్స్ మినహా వీడియో అప్ డేట్స్ ఏవీ రాలేదు. దేవర టీజర్ లేకుండానే డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దేవర ట్రైలర్ సెప్టెంబర్ నెల 7వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా విడుదలకు మూడు వారాల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తొలి ప్రాజెక్ట్ దేవర కావడం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ కు సోలో హీరోగా దేవర సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకం అని చెప్పవచ్చు. తారక్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు దేవర సినిమాపై ఆధారపడ్డాయని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: