రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపిక పడుకొని కీలక పాత్రలలో నటించగా ... శోభన , రాజేంద్ర ప్రసాద్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమా తెలుగు వర్షన్ కి ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ వచ్చాయి. ఈ సినిమాకు మొత్తంగా ఎన్ని కోట్ల లాభం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కల్కి మూవీ కి నైజాం ఏరియాలో 92.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 21.80 కోట్లు , ఉత్తరాంధ్రలో 21.73 కోట్లు , ఈస్ట్ లో 12.46 కోట్లు , వెస్ట్ లో 9.65 కోట్లు , గుంటూరులో 11.32 కోట్లు , కృష్ణ లో 11.32 కోట్లు , నెల్లూరు లో 6.19 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.27 కోట్ల షేర్ , 296.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 31.40 కోట్లు , ఓవర్సీస్ లో 83.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 302.52 కోట్ల షేర్ ... 5:30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ కి 248 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరగగా ... 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. మొత్తంగా ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 52.52 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: